ప్రియుడి కోసం కూతురి ఘనకార్యం .. తండ్రికి మత్తు మందు ఇచ్చి మరీ..

by Sumithra |   ( Updated:2021-11-13 04:54:53.0  )
murde
X

దిశ, వెబ్‌డెస్క్ : రోజు రోజుకు రక్తసంబంధాలకు విలువ లేకుండా పోతోంది. ప్రేమ మాయలో పడి కన్నవారినే హతమార్చుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ కోసం కన్న తండ్రినే హతమార్చింది ఓ కూతురు. ఈ ఘటన నగరంలోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. రామకృష్ణ అనే వ్యక్తి ఈ ఏడాది జులై నెలలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. అయితే ప్రమాదవశాత్తు చనిపోయాడని కుటుంబ సభ్యులు తెలపడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కానీ రామకృష్ణ పోస్టుమార్టం చేయడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

మృతదేహాం మీద గాయాలు ఉండడంతో అది ప్రమాదవశాత్తు కాదు, హత్యనే అని నిర్ధారణ అయ్యింది. దీంతో పోలీసులు మరోసారి కుటుంబ సభ్యులను విచారించగా షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ప్రేమ మాయలో పడి మైనర్ బాలిక తన తండ్రిని హత్య చేసినట్టు పోలీసుల విచారణలో తెలిపింది. తన ప్రేమకు అడ్డుగా ఉన్నాడని ఎలాగైనా తన తండ్రి అడ్డు తొలిగించుకోవాలని, తన తండ్రికి కోడికూరలో మత్తుమందు కలిపి పెట్టానని, సృహకోల్పోయిన తర్వాత తన ప్రియుడు సుఫారీగ్యాంగ్‌‌తో వచ్చి హత్య చేశాడని తెలిపింది. అలాగే తన కూతురి భవిష్యత్తు కోసం నిజం చెప్పలేదని బాలిక తల్లి పోలీసులకు తెలిపింది. దీంతో మైనర్ బాలికతోపాటు, ఆమె ప్రియుడు భూపాల్, హత్యచేసిన మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలిక మైనర్ కావడంతో జువైనల్ హోమ్‌కి తరలించారు.

Advertisement

Next Story