- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ, తెలంగాణ బ్యూరో: దయాల కల్పన దళితుల భూమి హక్కులు, ఆదివాసి సమస్యలు, చేనేత, చేతి వృత్తుల మనుగడపై పోరాడి చిన్న వయసులోనే జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. వివిధ రకాల సామాజిక సమస్యలపై పోరాడిన మహిళ నేతగా గుర్తింపు పొందినదని పలువురు నేతలు, కవులు, కళాకారులు, సామాజికవేత్తలు గుర్తు చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ‘గతిశీల మహిళ- కల్పన’ పేరిట దివంగత నేత(పీసీసీ కార్యదర్శి) దయాల కల్పన సంస్మరణ సభలో వందలాది మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, వామపక్షాల నాయకులు ఆమె పోరాట పటిమను కొనియాడారు. రాజకీయాల్లోకి రాకముందే సమాజం గురించి అధ్యయనం చేసిందన్నారు. కపార్ట్, భూమిక, పిలుపు, స్వామిరామానందతీర్థ గ్రామీణ సంస్థ, యాక్షన్ ఎయిడ్, పలు చేనేత సంఘాల్లో ఆమె పని చేసినట్లు తెలిపారు.
మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ.. చిన్న వయసులోనే కల్పన ఎంతో అనుభవం గడించిందని, పోరాట పటిమను ప్రదర్శించిందని కొనియాడారు. చేతి వృత్తులు, మహిళా సమస్యలు, లింగ వివక్ష వంటి అనేక సమస్యలపై పోరాడిందని గుర్తు చేశారు. టీఆర్ఎస్ నాయకుడు ఎల్.రమణ మాట్లాడుతూ.. పద్మశాలి వర్గంలో అత్యున్నత స్థానానికి ఎదిగిన నేత అని, హక్కుల కోసం దేశ వ్యాప్తంగా పర్యటించారన్నారు. మారుమూల ప్రాంతం నుంచి జాతీయ స్థాయి నేతలతో మమేకమై పని చేయడం విశేషమన్నారు. దక్షిణాఫ్రికాకు వెళ్లి అక్కడి పేదల హక్కుల కోసం ఉద్యమించిన నేతగా అభివర్ణించారు. ఆమె మృతి చేనేత, పద్మశాలి వర్గాలకు తీరని లోటు అన్నారు.
చేనేత జన సమాఖ్య అధ్యక్షుడు మాచర్ల మోహన్ రావు మాట్లాడుతూ.. కష్ట, సుఖాల్లో సగ భాగం మహిళ అనడానికి కల్పన సరైన ఉదాహారణగా చెప్పారు. సమస్య ఏదైనా చర్చలో తన ఘాటైన విమర్శలతో వాదన చేసేదన్నారు. ఆమె జీవితం నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు అనేకం ఉన్నాయన్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కర్నాటి విద్యాసాగర్, యర్రమాద వెంకన్ననేత, డీవైఎఫ్ నాయకుడు శంకర్, పద్మశ్రీ గజం అంజయ్య, కవి వడ్డెపల్లి కృష్ణ, ఆర్టిస్ట్ ఏలె లక్ష్మణ్, బొమ్ము రాఘురాం, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు గర్దాసు బాలయ్య, నాయకులు భారత పురుషోత్తం, కడవేరు రాములు, సీనియర్ జర్నలిస్టు పిట్టల శ్రీశైలం, సీపీఎఫ్ సంస్థ డైరెక్టర్ సరిత, అంకురం సంస్థ డైరెక్టర్ సుమిత్ర, పద్మశాలి సంఘం మహిళ విభాగం జాతీయ అధ్యక్షురాలు వనం దుష్యంతల తదితరులు ఆమె సేవలను కొనియాడారు.
ఈ సందర్భంగా దివంగత నేత కల్పన భర్త నిజాం కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ తడ్క యాదగిరి మాట్లాడుతూ.. కల్పన ఆశయాలను సాధించేందుకు ఆమె పేరిట ట్రస్టును నెలకొల్పి సేవా కార్యక్రమాలను అందించేందుకు ప్రయత్నిస్తామన్నారు. సంస్మరణ సభలో వందలాది కల్పన అభిమానులు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.