- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉద్యమాన్ని విరమించిన రైతు సంఘాలు.. కేంద్రం లేఖ
దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్రం తీసుకొచ్చిన మూడు రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న రైతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏడాదికి పైగా ఢిల్లీలోనే మకాం వేసి పోరాటం చేసిన రైతులు తమ ఇళ్లకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అక్కడ ఏర్పాటు చేసిన టెంట్లను తొలగిస్తున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు రైతు చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ చేసిన ఉద్యమానికి కేంద్రం వెనక్కి తగ్గి ఆ మూడు చట్టాలను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. అయితే, చట్టాలను విరమించినా.. ఉద్యమాన్ని ఆపని రైతులు.. పండించిన పంటకు మద్దతు ధర లభించేలా చట్టాన్ని తీసుకురావాలన్న డిమాండ్‌తో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు.
ఈ క్రమంలోనే కేంద్రం రైతులకు ఓ లేఖ రాసింది. అందులో MSPపై ఒక కమిటీని ఏర్పాటు చేసి, రైతులపై ఉన్న కేసులను వెంటనే ఉపసంహరించుకుంటామని వాగ్దానం చేస్తున్నట్లు ఉంది. అంతేగాకుండా చనిపోయిన రైతుల కుటుంబాలకు అందించే పరిహారం గురించి కూడా కేంద్రం రాసిన లేఖలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఉద్యమాన్ని విరమించి రైతులు ఇళ్లకు వెళ్లడంపై సంయుక్త కిసాన్ మోర్చా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ హామీలపై జనవరి 15న తిరిగి సమీక్షించనుంది.
We have decided to suspend our agitation. We will hold a review meeting on Jan 15. If Govt doesn't fulfill its promises, we could resume our agitation: Farmer leader Gurnam Singh Charuni following a meeting of Samyukta Kisan Morcha in Delhi pic.twitter.com/lWKMdtjeRI
— ANI (@ANI) December 9, 2021