ఆ వీడియోలు చూస్తూ అన్న కంటపడ్డ చెల్లి.. వెనుక నుంచి వచ్చి

by Sumithra |   ( Updated:2021-06-30 02:01:39.0  )
ఆ వీడియోలు చూస్తూ అన్న కంటపడ్డ చెల్లి.. వెనుక నుంచి వచ్చి
X

దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. వాట్సప్ వాడుతోందని చెల్లిని తన తోడబుట్టిన అన్నయ్య నరికి చంపిన ఘటన తూత్తుకుడి జిల్లా వాసవంపురంనగర్‌లో చోటు చేసుకుంది. కరోనా మహామ్మారి కారణంగా అందరూ ఆన్‌లైన్ క్లాసులకే పరిమితం అయ్యారు. కవిత ఇంటర్ చదువుతోంది. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ క్లాసుల కోసం తన చెల్లెలు కవితకు సెల్ ఫోన్ కొనిచ్చాడు అన్న మలైరాజా. అయితే సెల్ ఫోన్ వచ్చాక కవిత వాట్సప్‌లో వీడియోలు చూస్తూ ఎక్కవగా కనిపించింది. దీంతో వాట్సప్ వీడియోలు చూడకు అని పలుమార్లు హెచ్చరించాడు. ఆయినా కవిత వినలేదు. దీంతో ఆగ్రహానికి లోనైన మలైరాజ కవిత వీడియోలు చూస్తున్న క్రమంలో వెనుకవైపు నుంచి వచ్చి కత్తితో అతి దారుణంగా పొడిచి హత్య చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story