వివాహితతో అక్రమసంబంధం.. ఆ రాత్రి గుడిసెలో ఏం జరిగిందంటే ?

by Sumithra |
వివాహితతో అక్రమసంబంధం.. ఆ రాత్రి గుడిసెలో ఏం జరిగిందంటే ?
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకొని చివరికి ఆమె పై పెట్రోల్ పోసి నిప్పు అంటించిన ఘటన నగరంలోని కూకట్ పల్లిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

సహజీవనం ఒకరి ప్రాణం తీసింది, మరకొరు ప్రాణాపాయ స్థితిలో ఉండేలా చేసింది అనడానికి ఈ సంఘటనే నిదర్శనం. ఓ ఆసుపత్రిలో పనిచేసే వెంకటలక్ష్మికి వెల్డింగ్ దుకాణంలో పనిచేసే వెంకటేష్‌(55)తో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. ఇక లక్ష్మికి భర్త పదేళ్ల కిందనే మరణించాడు ఆమెకు ఒక కూతురు, కొడుకు ఉండగా, కూతురికి పెళ్లి చేసింది. వెంకటేష్‌ భార్య చనిపోయింది. ఇతనికి ఒక కొడుకు ఉన్నాడు. ఇద్దరికీ భార్య, భర్త లేకపోవడంతో వీరు కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా వీరి మధ్య ప్రేమ పెరిగింది.

ఈ క్రమంలో ఏమైందో తెలియదు కానీ వెంకటేష్ ప్రవర్తనలో కాస్త మార్పు వచ్చింది. దీంతో అతని ప్రవర్తన మార్చుకోవాలని లక్ష్మి ఎన్నిసార్లు చెప్పినా అతను వినలేదు. దీంతో అతనికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. అందుకోసం తన కుమారుడిని తీసుకొని లక్ష్మి కూకట్ పల్లి వెళ్లిపోయింది. ఇక చాలా రోజుల నుంచి సహజీవనం చేస్తున్న లక్ష్మి దూరం పెట్టడంతో వెంకటేష్ మానసికంగా కుంగిపోయాడు. ఆమె ఎడబాటు తట్టుకోలేక వెంకటేష్ ఏకంగా ఓ రోజు రాత్రి కూకట్ పల్లి లోని లక్ష్మి నివాసానికి వెళ్లారు. దీంతో అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం వారు ఉన్న గుడిసెలో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఇద్దరూ కాలిన గాయాలతో కనిపించడంతో ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తనతో ఉండటానికి లక్ష్మి ఒప్పుకోలేదని వెంకటేష్ ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా సహజీవనం రెండు కుటుంబాల్లో విషాదం నింపిందని అక్కడి స్థానికులు చర్చించుకుంటున్నారు.

Advertisement

Next Story