నిజామాబాద్‌లో పసికందు మృతదేహం కలకలం

by Shyam |
Child dead body
X

దిశ, వెబ్‌డెస్క్: నిజామాబాద్ జిల్లాలో పసికందు మృతదేహం కలకలం రేపింది. శనివారం తెల్లవారుజామున ఖలీల్‌వాడిలోని ఓ ప్రయివేటు ఆస్పత్రి వద్ద చిన్నారి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story