అక్కడ నీళ్ళు కొల్లగొడుతుంటే.. ఇక్కడ సమీక్షలా!

by Shyam |
BJP leader DK Aruna
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఏపీ ప్రభుత్వంRDS నుంచి నీళ్లు కొల్లగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంటే.. సీఎం కేసీఆర్ నోరు మెదపకుండా, ఇక్కడ ఉమ్మడి పాలమూరు జిల్లా నేతలు అధికారులతో రోజుల తరబడి సమీక్షలు నిర్వహించడం ఏంటనీ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ ప్రశ్నించారు. గురువారం గద్వాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎలాంటి అనుమతులు లేకుండా నాలుగు టీఎంసీల నీటిని ఏపీకి తరలించుకుపోతుంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్ మౌనంగా ఉండడం, పలు అనుమానాలకు తావిస్తోందని అన్నారు. 15.9 టీఎంసీల సాగునీటి వాటాను దక్కించుకోలేని పరిస్థితిలో మన రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్డీఎస్‌ను కేసీఆర్ ఆయుధంగా మలుచుకుని అధికారంలోకి వచ్చారని గుర్తుచేశారు.

Advertisement

Next Story

Most Viewed