కరోనా నియంత్రణకు ఉత్తమ్ పిలుపు..

by Ramesh Goud |
కరోనా నియంత్రణకు ఉత్తమ్ పిలుపు..
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని కోరారు. శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మే 1న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మాస్క్ ల పంపిణీ కార్యక్రమాలు చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. దేశంలో కరోనా ఒక భయంకర పరిస్థితులు కల్పిస్తుందని, ప్రభుత్వాల చేతకాని తనంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ కరోనో రోగులకు ఆసుపత్రులలో బెడ్స్ దొరకడం లేదన్నారు. ఆక్సిజన్ , మందులు, వాక్సిన్స్ కొరత తీవ్రంగా ఉందని, ఇలాంటి పరిస్థితులలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని కోరారు. ప్రజల్లో కరోనాపై మరింత అవగాహన పెంచేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాస్క్ ల పంపిణీ చేపడుతున్నట్లు తెలిపారు.

తాలు పేరుతో రైతులను దోచుకుంటున్న మిల్లర్లు

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే క్వింటాకు 3 కిలోలు, మిల్లులకు వెళ్లిన తర్వాత మళ్లీ తాలు పేరుతో తరుగు తీస్తూ రైతులను మిల్లర్లు దోచుకుంటున్నారని జాతీయ కిసాన్ కాంగ్రెస్ వైస్ చైర్మన్ కోదండరెడ్డి, రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కిసాన్ కాంగ్రెస్ సెల్ అధ్యక్షులు, రైతులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు.

రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదని, 4485 కేంద్రాలకు కొబ్బరికాయలు కొట్టిన పూర్తి స్థాయిలో కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటివరకు 6.43 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తాలు పేరుతో తరుగు తీసి తూకం వేసినప్పటికి రైతుకు ట్రాక్ సిట్ ఇవ్వడం లేదని ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed