మినీ ట్రక్కులపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం

by srinivas |
mini trucks
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో ఇంటింటికి రేషన్‌ను పంపిణీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం 9 వేలకు పైగా మినీ ట్రక్కులను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మినీ ట్రక్కుల విషయంలో ఎస్సీ లబ్ధిదారులకు తీపికబురు చెప్పింది. సబ్సిడీని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 60 శాతం సబ్సిడీతో ప్రభుత్వం మినీ ట్రక్కులను లబ్ధిదారులకు అందజేసింది. మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారుడే భరించాల్సి ఉంది. ఇది లబ్ధిదారులకు కష్టంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వం సబ్సిడీలో కీలక మార్పులు చేసింది. 60 శాతం ఉన్న సబ్సిడీని 90 శాతానికి పెంచింది. 10 శాతం మాత్రమే లబ్ధిదారుడు పెట్టుకోవాలి. 10 శాతం డబ్బును కూడా 72 విడతల్లో వాయిదా రూపంలో చెల్లించుకునేలా సడలింపులు ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖకు ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

Next Story

Most Viewed