దళితబంధు కృతజ్ఞత సభను విజయవంతం చేయండి..

by Sridhar Babu |
dhalitha-bandhu
X

దిశ,మణుగూరు : దళితబంధు కృతజ్ఞత సభను దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాదిగ జేఏసీ అధ్యక్షులు సిద్ధేల తిరుమలరావు పిలుపునిచ్చారు. అక్టోబర్ 5న రాష్ట్రరాజధాని హైదరాబాదులో దళిత సంఘాలనాయకుల ఆధ్వర్యంలో దళిత బంధు కృతజ్ఞత సభ నిర్వహించనున్నారని తెలిపారు. శుక్రవారం మండలంలోని గుట్టమల్లారంలో మాదిగ జేఏసీ సంఘ నియోజక వర్గ అధ్యక్షులు గంగారపు రమేష్ అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్టోబర్ 5న దళిత బందు కృతజ్ఞత సభను హైద్రాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహిస్తామన్నారు.

తెలంగాణ రాష్ట్రఎస్సీ కార్పొరేషన్ తొలి చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి ఆధ్వర్యంలో తెలంగాణ దళిత, కుల, ప్రజాసంఘాల నాయకుల రాష్ట్రస్థాయి సమావేశం గురువారం హైదరాబాద్ లోని హోటల్ సెంట్రల్ కోర్టులో నిర్వహించారు. సమావేశంలో దళిత బందు కృతజ్ఞతసభను హైద్రాబాద్ లో నిర్వహించేందుకు తీర్మానం చేశారన్నారు. కృతజ్ఞత సభకు తెలంగాణ ప్రజాసంఘాల నాయకులు పూర్తి మద్దతు తెలుపుతారన్నారు.

Advertisement

Next Story