నేషన్ వైడ్.. రజినీ మూడ్

by Shyam |
నేషన్ వైడ్.. రజినీ మూడ్
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ రజినీకాంత్ ఇమేజ్‌ను క్యాష్ చేసుకుంటుంది డిస్కవరీ ఛానల్. మార్చి 23న రజినీకాంత్, బేర్ గ్రిల్స్‌తో కలిసి చేసిన యాక్షన్ అడ్వెంచర్ ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్ షో’ ప్రసారం కానున్న నేపథ్యంలో … తలైవా ఫ్యాన్స్‌లో మరింత ఉత్సాహాన్ని నింపుతూ మాస్ సాంగ్‌ రిలీజ్ చేసింది. ఇన్ టు ద వైల్డ్ వాంగా… ఇన్ టు ద వైల్డ్ సాంగ్ రిలీజ్ చేసిన డిస్కవరీ ఛానల్ .. రజినీ ఫ్యాన్స్‌కు డ్యాన్స్ ఛాలెంజ్ విసురుతూ ..వీర లెవల్ మాస్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది.

దీంతో నేషన్ వైడ్‌గా వైల్డ్ మాస్ సెలబ్రేషన్స్ ప్రారంభం అయ్యాయ్. ‘ఆన్ రజినీ మూడ్.. బేర్ ఓడ్.. వైల్డ్ పోడ్’ అంటూ ఊర మాస్ స్టెప్పులు వేస్తూ వీడియోలు రిలీజ్ చేసే పనిలో పడ్డారు రజినీ ఫ్యాన్స్. పూర్తిగా రజినీ మూడ్‌లో ఉన్న అభిమానులు షోని పెద్ద హిట్ చేసే పనిలో పడ్డారు. కనీవిని ఎరుగని రీతిలో షో రేట్‌ను పెంచేందుకు సోషల్ మీడియా వేదికగా ప్రమోషన్స్ షురూ చేశారు. ఇప్పటికే #ThalaivaOnDiscovery పేరుతో డ్యాన్స్ మూవ్స్ షేర్ అవుతుండగా… మార్చి 23న రా. 8 గంటలకు ‘ఇన్ టు ద వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్ అండ్ సూపర్ స్టార్ రజినీకాంత్’ షో ప్రసారం కానుంది.


Tags: ThalaivaOnDiscovery, Into the Wild with Bear Grylls, Man vs Wild, Rajinikanth

Advertisement

Next Story