- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జీఎస్టీ పెంపుపై వస్త్ర పరిశ్రమ ఆందోళన!
దిశ, వెబ్‌డెస్క్: వచ్చే ఏడాది జనవరి 1 నుంచి దుస్తులపై జీఎస్టీ రేట్లను 5 శాతం నుంచి 12 శాతానికి పెంచాలని జీఎస్టీ కౌన్సిల్ ప్రతిపాదించింది. దీనిపై వస్త్ర పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీనివల్ల 85 శాతం పరిశ్రమ ప్రభావితమవుతుందని, ఇప్పటికే రూ.1,000 విలువ కలిగిన దుస్తులపై 12 శాతం జీఎస్టీ అమలవుతోందని వారు అన్నారు. దాదాపు 80 శాతం ఉత్పత్తులపై ఈ పెంపు ప్రభావం చూపుతోందని, ఇది వినియోగదారులకు భారంగా మారుతుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. పరిశ్రమలోని 15 శాతం కంటే ఎక్కువగా లేని సరఫరా విభాగంపై పడుతున్న ఇన్వర్టెడ్ డ్యూటీ కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఈ నిర్ణయంతో పరిశ్రమ మొత్తం మూలధన నిధుల అవసరాలపై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. ముఖ్యంగా ఎంఎస్ఎంఈ, నూలు వంటి ముడి పదార్థాల ధరల్లో కొనసాగుతున్న పెరుగుదల, కరోనా ముందుస్థాయికి పరిశ్రమ వృద్ధి సాధించేందుకు సవాలుగా మారుతుంది. ‘ఈ జీఎస్టీ పెంపు వినియోగదారులను చవకైన, నాణ్యత లేని వస్తువులను కొనేందుకు ప్రేరేపిస్తుందని’ లక్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ అశోక్ అన్నారు. ఇప్పుడున్న దానికంటే 7 శాతం పన్ను పెంచడం ద్వారా పరిశ్రమలో ఎక్కువ ఉపాధి నష్టానికి దారితీస్తుందని, ఇది దాదాపు 20 లక్షలకు మించి ఉండవచ్చని రూపా కంపెనీ ఎండీ కె బి అగర్వాలా తెలిపారు. ఈ నేపథ్యంలో పరిశ్రమలో ఇప్పుడున్న జీఎస్టీ రేటునే కొనసాగించాలని పరిశ్రమ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.