విజయనగరం జిల్లాలో టెన్షన్ టెన్షన్

by srinivas |   ( Updated:2021-01-03 06:41:26.0  )
విజయనగరం జిల్లాలో టెన్షన్ టెన్షన్
X

దిశ, వెబ్‌డెస్క్: విజయనగరం జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ సీనియర్ నేత అశోక్‌ గజపతిరాజుపై మంత్రి వెల్లంపల్లి వ్యాఖ్యలను నిరసిస్తూ ఆదివారం టీడీపీ శ్రేణులు ర్యాలీ చేపట్టాయి. ఈ ర్యాలీలో అశోక్‌ గజపతిరాజు కూతురు ఆదితి పాల్గొన్నారు. మయూరి సెంటర్‌కు చేరుకున్న ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగగా తోపులాటకు దారితీసింది. మంత్రి వెల్లంపల్లి దిష్టిబొమ్మను టీడీపీ కార్యకర్తలు దగ్ధం చేశారు. మయూరి సెంటర్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ కాగా వాహనాలను పోలీసులు దారి మళ్లిస్తున్నారు. ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Advertisement

Next Story