డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీ పోటాపోటీ ఫిర్యాదులు

by srinivas |   ( Updated:2021-09-17 06:25:31.0  )
డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీ పోటాపోటీ ఫిర్యాదులు
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ, వైసీపీ నేతల వాగ్వాదంతో ఏపీ డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిని వైసీపీ నేతలు, కార్యకర్తలు ముట్టడించడంపై డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు టీడీపీ నేతలు వచ్చారు. అదే సమయంలో తమపై టీడీపీ నేతలు, కార్యకర్తలు దాడి చేశారంటూ వైసీపీ నేతలు ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. దీంతో డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డీజీపీ కార్యాలయం వద్ద టీడీపీ నేతలతో పోలీసులు చర్చలు జరుపుతున్నారు.

వైసీపీ ఎమ్మెల్యే ఆర్కేను డీజీపీ కార్యాలయంలోకి అనుమతించిన పోలీసులు.. టీడీపీ నేతలను మాత్రం అనుమతించలేదు. దీంతో తమను ఎందుకు అనుమతించరని టీడీపీ నేతలు నిలదీశారు. పోలీసుల వైఖరిపై డీజీపీ కార్యాలయం వద్ద టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు.

Advertisement

Next Story