- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జొమాటో సర్వీస్.. టొమాటోలా క్రష్ అయిపోతుంది!
దిశ, ఫీచర్స్ : ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో ప్రయోగాలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే 10 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ సర్వీస్ అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. 'జొమాటో ఇన్‌స్టంట్' పేరుతో అందుబాటులోకి తీసుకురానున్న ఈ ప్రయోగం.. గురుగ్రామ్‌లో పైలెట్ ప్రాజెక్ట్‌గా అమలు కానుందని తెలిపారు. అంతేకాదు కస్టమర్‌ను శాటిస్‌ఫై చేసేందుకు ప్రజెంట్ 30 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ చేస్తున్న తాము.. ఈ రంగంలో ముందుండాలంటే మరిన్ని కొత్త ఆవిష్కరణలతో రావాల్సి ఉంటుందని వివరించారు జొమాటో ఫౌండర్ దీపిందర్ గోయల్. అలాగని తాము డెలివరీ పార్ట్‌నర్‌లపై ఒత్తిడి చేయబోమని, డెలివరీ బాయ్స్‌కు జరిమానా విధించి.. వారిని ప్రమాదంలో నెట్టబోమని స్పష్టం చేశారు.
అయితే ఈ ప్రకటనతో సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అయ్యాయి. 'ఎవరిని నొప్పించక.. తానొప్పక' అన్నట్లుగా ఉంది జొమాటో వ్యవహరం అంటున్న మీమర్స్.. అలా చేస్తే ఫుడ్ డెలివరీ 10 నిమిషాల్లో ఎలా కంప్లీట్ అవుతుందని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే జొమాటో త్వరలోనే టొమాటో మాదిరిగా క్రష్ అయిపోవడం ఖాయమని అంటున్నారు. ఇక మరికొందరు '10 నిమిషాలు కాదు.. ఆర్డర్ చేయకముందే ఫుడ్ డెలివరీ కావాలి' అని మీమ్స్ క్రియేట్ చేయడం బిజీగా ఉన్నారు.