నేను చెప్పేదాకా ఆగండి.. యామిగౌతమ్ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ హ్యాక్‌‌

by Javid Pasha |
నేను చెప్పేదాకా ఆగండి.. యామిగౌతమ్ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ హ్యాక్‌‌
X

దిశ, సినిమా : ఇటీవలి కాలంలో సెలబ్రిటీలు తమకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నారు. కానీ కొన్నిసార్లు తమ సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ అవడంతో ఇబ్బందులు పాలవుతున్నారు. ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు ఈ సమస్యను ఎదుర్కోగా.. తాజాగా బాలీవుడ్‌ బ్యూటీ యామీ గౌతమ్‌‌కూ ఇలాంటి అనుభవమే ఎదురైనట్లు తెలిపింది. ఈ సందర్భంగా తన ఫ్యాన్స్‌, ఫాలోవర్స్‌ను అలర్ట్‌ చేస్తూ ట్వీట్‌ చేసిన నటి.. ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ హ్యాక్‌ అయినట్లు వెల్లడించింది. తన ఖాతా నుంచి వచ్చిన ఎలాంటి పోస్ట్‌, ప్రకటనలకు స్పందించవద్దని పేర్కొంది. ప్రస్తుతం ఈ ఇష్యూపై ఐటీ టీమ్ పనిచేస్తున్నట్లు చెప్పిన యామి.. తాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చే వరకు ఓపిక పట్టాలని అభిమానులను కోరింది.

Advertisement

Next Story

Most Viewed