- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్యాకేజ్‌డ్ ఆహార పదార్థాల వ్యాపారంలోకి విప్రో కన్స్యూమర్ కంపెనీ!
ముంబై: ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ విప్రో కన్స్యూమర్ కేర్ అండ్ లైటింగ్ దేశీయంగా ప్యాకేజ్‌డ్ ఫుడ్ వ్యాపారంలో ప్రవేశిస్తున్నట్టు శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇందుకోసం విప్రో కన్స్యూమర్ ఇండియా వ్యాపార హెడ్‌గా ఉన్న అనిల్ చుగ్‌ను ప్యాకేజ్‌డ్ ఆహార పదార్థాల విభాగం వర్టికల్ హెడ్‌గా నియమించింది. అలాగే కంపెనీ కన్స్యూమర్ కేర్ ఫిలిప్పీన్స్ విభాగానికి హెడ్‌గా ఉన నీరజ్ ఖత్రీని విప్రో కన్స్యూమర్ కేర్ ఇండియా హెడ్‌గా తీసుకొచ్చింది. ప్రధానంగా సంస్థ పర్సనల్ కేర్ విభాగంలో ఇప్పటికే ఉన్న ఉత్పత్తులతో పాటు ఈ విభాగంలో మరింత సామర్థ్యాన్ని సాధించడానికి ప్యాకేజ్‌డ్ ఆహార పదార్థాల వ్యాపారంలోకి అడుగుపెడుతున్నామని, దీనివల్ల భారత ఎఫ్ఎంసీజీ రంగంలో మరింత విస్తరించడానికి వీలవుతుందని విప్రో కన్స్యూమర్ కేర్ అండ్ లైటింగ్ సీఈఓ వినీత్ అగర్వాల్ చెప్పారు.
ఈ ఏడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో విప్రో కన్స్యూమర్ కేర్ అండ్ లైటింగ్ రూ. 8,634 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. కంపెనీ ముఖ్యంగా పర్సనల్ కేర్ ఉత్పత్తులు, హోమ్ కేర్, ఎలక్ట్రిక్ వైర్ పరికారలు, లైటింగ్ వ్యాపారం, సిటింగ్ ఉత్పత్తులు, టాయిలెట్, వెల్‌నెస్, ఫేస్ కేర్ ఉత్పత్తులను విక్రయిస్తోంది. కొత్తగా కన్స్యూమర్ వ్యాపారంలోని కీలక బాధ్యతలకు అనిల్ చుగ్, నీరజ్ ఖత్రీని నియమించడం ద్వారా తమ ఎఫ్ఎంసీజీ రంగంలో గట్టి పోటీనివ్వాలనే లక్ష్యంతో తీసుకున్న నిర్ణయమని వినీత్ అగర్వాల్ వివరించారు. ప్రస్తుతం విప్రో కన్స్యూమర్ సంస్థ సంతూర్, ప్రీమియం పర్సనల్ కేర్ బ్రాండ్ యార్డ్‌లీ, చంద్రిక, గ్లూకోవిటా, ఇంకా పలు బ్రాండ్లను విక్రయిస్తోంది.