విల్‌స్మిత్ బహిరంగ క్షమాపణ.. రాక్‌తో మాట్లాడాలని ఉందంటూ

by srinivas |   ( Updated:2023-06-13 14:39:20.0  )
విల్‌స్మిత్ బహిరంగ క్షమాపణ.. రాక్‌తో మాట్లాడాలని ఉందంటూ
X

దిశ, సినిమా : హాలీవుడ్ స్టార్ హీరో విల్ స్మిత్.. కమెడియన్ క్రిస్ రాక్‌కు బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు. అంతేకాదు రాక్‌ను నేరుగా కలిసి సారీ చెప్పాలని ఉందన్న ఆయన ఈ సంఘటనతో ఇబ్బందిపడ్డవాళ్లందరూ క్షమించాలని కోరాడు. ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా ఓ వీడియో షేర్ చేసిన హీరో.. '94వ ఆస్కార్‌ అవార్డ్స్ ఈవెంట్‌‌లో జరిగిన ఘటన తర్వాత క్రిస్‌ రాక్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించా. కానీ అతను నన్ను కలిసేందుకు, నాతో మాట్లాడేందుకు సిద్ధంగా లేడు. క్రిస్‌ రాక్‌ ఇప్పుడు అందరి ముందు నీకు క్షమాపణలు చెబుతున్నా. నీకు జరిగిన దానికి ఇది సరితూగదని తెలుసు. నువ్వు ఎక్కడంటే అక్కడ నీతో మాట్లాడడానికి రెడీ. ఐ యామ్ సారీ. నీకే కాదు నీ కుటుంబానికి, ఆస్కార్‌ కమిటీకి, నామినీలకు, నా వల్ల ఇబ్బంది పడిన నా కుటుంబానికి క్షమాపణలు' అని చెప్పుకొచ్చాడు. ఇక స్మిత్ బహిరంగంగా స్పందించడం ఇదే మొదటిసారి కాగా.. స్మిత్‌ భార్య, నటి జాడా పింకెట్‌‌ షేవ్‌ తలను ఉద్దేశిస్తూ 'జీఐ జేన్‌' అంటూ క్రిస్‌ రాక్‌ జోక్‌ చేయడం.. కోపంతో రగిలిపోయిన స్మిత్ స్టేజ్‌ మీదకు వెళ్లి అతని చెంప పగలకొట్టడం తెలిసిందే.

Advertisement

Next Story