- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నువ్వు కేంద్ర మంత్రి వేమో.. కానీ ఇది మహారాష్ట్ర
ముంబై: కేంద్ర మంత్రి నారాయణ రాణే పై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఠాక్రే కుటుంబం, మహారాష్ట్ర ప్రభుత్వం పై రాణే బెదిరింపులకు దిగడం పై శనివారం ఆయన స్పందించారు. బెదిరింపులకు దిగడం మానుకోవాలని హెచ్చరించారు. 'మీరు కేంద్ర మంత్రి కావచ్చు. కానీ ఇది మర్చిపోకండి. నేను మీకు బాప్. మీకు దీనర్థం ఏమిటో బాగా తెలుసు' అని అన్నారు. అంతకుముందు రోజు రాణే ఎన్‌ఫోర్స్ డైరక్టరేట్‌కు చెందిన నలుగురు మాతోశ్రీ వ్యక్తులకు, నోటీసులు ఇచ్చేందుకు ఇచ్చేందుకు సిద్ధమైందని అన్నారు.
దీనిపై సంజయ్ మాట్లాడుతూ 'నారాయణ తన వద్ద మా జాతకం ఉందని హెచ్చరిస్తున్నారు. మా వద్ద కూడా ఆయన జాతకం ఉంది' అని అన్నారు. మరో ఎంపీ కిరీట్ సోమయ్య ఆరోపణలపై స్పందిస్తూ.. 'నీవు స్కామ్ కు సంబంధించిన పత్రాలు కేంద్ర సంస్థలకు ఇస్తే.. మేము నీకు సంబంధించినవి కూడా ఇస్తాం. భయపెట్టకు.. మేము భయపడము' అని అన్నారు. సోమయ్య రూ.300 కోట్ల ప్రాజెక్టులో అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఈ విషయాన్ని ఆయన ట్వీట్ ద్వారా ప్రశ్నించారు. సోమయ్య కుటుంబ సభ్యులకు కూడా దీనిలో ప్రమేయం ఉందని విమర్శించారు.