ప్రజాభివృద్దే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి

by Naveena |
ప్రజాభివృద్దే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి
X

దిశ, పెద్ద కొత్తపల్లి: ప్రజా పాలనలో ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర ఎక్సైజ్ పర్యటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. పెద్దకొత్తపల్లి మండలం చెన్నపురావు పల్లి లో నూతనంగా నిర్మించిన అంగన్ వాడి భవనాని సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం పెద్దకొత్తపల్లి మండల రెవెన్యూ కార్యాలయంలో మండలానికి చెందిన 114 మంది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు మంత్రి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ..నిరుపేద కుటుంబాల్లోని ఆడబిడ్డల వివాహాల కోసం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి ,షాది ముబారక్ పథకాల ద్వారా ఆ పేద కుటుంబాలకు కొండంత బలం చేకూరుతుందని పేర్కొన్నారు. అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని, ఇందులో ఫైరవీకారులకు తావు లేదన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో బన్సిలాల్, తాసిల్దార్ జే కే మోహన్, డిప్యూటీ తాసిల్దార్ రమేష్ నాయక్, నైన్ నాయినేని పల్లి మైసమ్మ చైర్మన్ శ్రీనివాస్ యాదవ్, జిల్లా గ్రంధాల సంస్థ మాజీ చైర్మన్ నాగపురి విష్ణు,పెద్దకొత్తపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తగిలి కృష్ణయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గోపాల్ రావు, లక్ష్మణరావు, అశోక్ రెడ్డి రవీందర్ రెడ్డి బద్య నాయక్, రమేష్, చిత్ర నాథ్, గడ్డికోపులు ఎల్లయ్య, మాజీ ఎంపీటీసీ దండు నరసింహ,మాజీ ఎంపీపీ వరదరాజుల వెంకటేశ్వరరావు,మాజీ ఎంపీపీ ప్రతాప్ గౌడ్,నాయకులు మేకల చంద్రయ్య, మాజీ ఎంపిటిసి రవికుమార్,డిప్యూటీ తాసిల్దార్ రమేష్ నాయక్,వివిధ గ్రామాల మాజీ సర్పంచులు,రెవిన్యూ సిబ్బంది,కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మంత్రికి వినతి పత్రం

తమకు గత ఏడు నెలల నుంచి వేతనాలు చెల్లించడం లేదని, గ్రామపంచాయతీ కార్మికులు మంత్రి జూపల్లి కృష్ణారావు వినతిపత్రం అందజేశారు. మంత్రి స్పందిస్తూ ప్రతి నెల ఒకటో తారీకు లేదా ఐదో తారీకు నాటికి వేతనాలు చెల్లించే విధంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్మికులు బాలస్వామి ఎల్లమ్మ ఎల్లయ్య రాజేందర్ కాశమ్మ బాలమ్మ చిన్న బాలమ్మ, బాలీశ్వరమ్మ తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story