- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రధాన సమస్యలపై అధికారులు దృష్టి సారించాలి : సంగారెడ్డి కలెక్టర్
దిశ,సంగారెడ్డి : ప్రజల ప్రధాన సమస్యలపై అధికారులు దృష్టి సారించి సమస్యల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రజావాణిలో 85 దరఖాస్తులు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించడం లక్ష్యంగా అధికారులు విధులు నిర్వహించాలని సూచించారు.
ప్రజలకు సకాలంలో న్యాయం పొందేందుకు ఈ కార్యక్రమం మంచి వేదికగా మారిందని పేర్కొన్నారు. అర్జీలు అన్నింటినీ తక్షణమే పరిష్కరించి సంబంధిత అధికారులు సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల ప్రధాన సమస్యలపై అధికారులు దృష్టి సారించి సమస్యల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీఆర్ఓ పద్మజ రాణి, ఆర్డీవో రవీందర్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.