Viral Video : గాలిపటం ఎగురవేసిన కోతి.. నెట్టింట్లో వీడియో వైరల్

by M.Rajitha |   ( Updated:2025-01-06 12:58:57.0  )
Viral Video : గాలిపటం ఎగురవేసిన కోతి.. నెట్టింట్లో వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్ : సంక్రాంతి పండుగ(Sankranthi Festival)కు చిన్నా పెద్దా గాలిపటాలు(Kites) ఎగురవేస్తూ కేరింతలు కొట్టడం సహజం. పల్లెల్లో, పట్టణాల్లో ఎక్కడ చూసిన గాలిపటాల సందడి కనిపిస్తుంది. అయితే.. మీతోపాటు నేను కూడా ఎంజాయ్ చేస్తా అంటూ ఓ కోతి(Monkey) గాలిపటం ఎగురవేస్తూ కనిపించింది. వానరం గాలిపటం ఎగురవేసే వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో.. ఓ ఇంటి డాబాపై ఉన్న ట్యాంక్‌పై కోతి కూర్చుని ఉండగా.. దాని చేతికి గాలిపటం మాంజా చిక్కింది. దీంతో అది దాన్ని పట్టుకుని గాలిపటాన్ని గుంజుతూ కనిపించింది. అచ్చం మనిషి మాదిరిగానే మాంజాను లాగుతూ ఎంజాయ్ చేసింది. కాగా ఇది ఎక్కడ జరిగిందో, ఎప్పుడు జరిగిందో ఖచ్చితంగా తెలియక పోయినా.. వీడియో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు వావ్ అంటూ ఎంజాయ్ చేస్తున్నారు.

Advertisement

Next Story