Ajith Kumar: అజిత్ కుమార్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్టైలీష్ లుక్‌ విడుదల

by Hamsa |
Ajith Kumar: అజిత్ కుమార్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్టైలీష్ లుక్‌ విడుదల
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్(Ajith Kumar) ‘తునీవ్’ సినిమా తర్వాత ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన రెండు భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తున్నారు. విదాముయర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ(Good Bad Ugly) వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ రెండు మూవీస్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ రవిచంద్రన్(Ravichandran) దర్శకత్వంలో రాబోతుండగా.. దీనిని పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్(Devi Sri Prasad) సంగీతం అందిస్తున్నారు. ఇందులో త్రిష కృష్ణన్(Trisha Krishnan) , ప్రభు , ప్రసన్న , అర్జున్ దాస్ , సునీల్, రాహుల్ దేవ్, యోగి బాబు(Yogi Babu) కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ అన్ని మంచి రెస్పాన్స్‌ను దక్కించుకోవడంతో పాటు హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ సినిమా ఏప్రిల్ 10న థియేటర్స్‌లోకి రాబోతున్నట్లు తెలుపుతూ గన్ పట్టుకుని సోఫాలో కూర్చుని స్టైలిష్ లుక్‌లో ఉన్న అజిత్ కుమార్ పోస్టర్‌ను వదిలారు.

Advertisement

Next Story