ACB Notice: రాష్ట్రంలో సంచలనం.. కేటీఆర్‌కు మరోసారి ACB నోటీసులు

by Gantepaka Srikanth |
ACB Notice: రాష్ట్రంలో సంచలనం.. కేటీఆర్‌కు మరోసారి ACB నోటీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌(KTR)కు ఏసీబీ(ACB) అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈనెల 9వ తేదీన విచారణకు హాజరు కావాలని సోమవారం సాయంత్రం జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. గచ్చిబౌలి(Gachibowli)లోని కేటీఆర్ నివాసం(Orion Villas)లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అయితే.. తన ఇంట్లో ఏసీబీ సోదాలు జరుగుతాయని ఈరోజు (జనవరి 06న) ఉదయమే కేటీఆర్ మీడియాతో చెప్పటం గమనార్హం.

ఆయన చెప్పినట్టుగానే ఏసీబీ అధికారులు సాయంత్రానికి ఆయన నివాసంలో సోదాలకు పాల్పడటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు సోదాలు జరుగుతుండగానే.. మరోవైపు నోటీసులు జారీ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఫార్ములా ఈ రేసు కేసులో ఇప్పటికే కేటీఆర్‌ను ఏ1గా పేర్కొనగా.. ఏసీబీ, ఈడీ వరుసగా నోటీసులు జారీ చేస్తోంది. ఇవాళ ఏసీబీ విచారణకు హజరయ్యేందుకు వెళ్లిన కేటీఆర్.. తన లాయర్‌ను అనుమతించలేదన్న కారణంతో తిరిగి వచ్చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story