అక్కడివాళ్లంతా 'హోమో సెక్స్‌వల్స్'.. షాకింగ్ కామెంట్స్ చేసిన దర్శకుడు

by Javid Pasha |
అక్కడివాళ్లంతా హోమో సెక్స్‌వల్స్.. షాకింగ్ కామెంట్స్ చేసిన దర్శకుడు
X

దిశ, సినిమా: దేశవ్యాప్తంగా 'ది కాశ్మీర్ ఫైల్స్' సినిమా వివాదం ఇంకా కొనసాగుతూనే ఉండగా.. దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివేక్ భోపాలీ అంటే 'హోమో సెక్స్‌వల్' అని సంచలన కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఆయన అనుచిత వ్యాఖ్యలపై భోపాలీ ప్రజలు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. విషయానికొస్తే.. ఇంటర్వ్యూలో వివేక్ భోపాలీ గురించి మాట్లాడుతూ.. 'నేను భోపాల్ వాడినే. కానీ, ఆ విషయాన్ని ఎక్కడా చెప్పడానికి ఇష్టపడను. ఎందుకంటే భోపాలీ అంటే స్వలింగసంపర్కుడని, నవాబుల ప్రవర్తన అనే అర్థాలున్నాయి' అంటూ వివరించాడు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ కాగా దర్శకుడిపై ఆగ్రహంతో ఊగిపోతున్న భోపాలి ప్రజలు వివేక్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు 'ఆయనకు అలాంటి అనుభవం ఉందేమో కానీ, భోపాల్ వాసులకు అలాంటి చెడు అలవాటు లేదు' అంటూ వివేక్‌కు కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేయడం విశేషం.

Advertisement

Next Story