- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫార్మా కంపెనీ మాకొద్దు.. గ్రామస్తులు ఆందోళన!
దిశ, చిన్నశంకరంపేట: కియో ఫార్మా కంపెనీ మాకొద్దని గ్రామస్తులు ఖాజాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గురువారం ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం చిన్న శంకరం పేట మండలం ఖాజాపూర్ గ్రామ శివారు ప్రాంతంలో ఫార్మసీ కంపెనీ నిర్మాణ పనులకు కొంతమంది కూలీలు వెళుతున్నారని తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి గ్రామపంచాయతీ ఆవరణలో ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో గ్రామ సర్పంచ్ కుంట నాగలక్ష్మి, ఎంపీటీసీ భాష పల్లి యాదగిరి అక్కడికి చేరుకొని ఫార్మా కంపెనీ స్థితిగతులపై ప్రజలకు తెలియజేశారు.
దీంతో గ్రామస్తులు ఇప్పటికే గ్రామ శివారులో కంపెనీ ఉన్నందున అనేకమైన రోగాల బారిన పడ్డామని, ఫార్మా కంపెనీ ద్వారా కెమికల్ దుర్వాసనతో నిండి గ్రామంలో లేనిపోని అంటురోగాలు ఏర్పడతాయని కంపెనీ మా గ్రామ శివారులో నిర్మించవద్దని గ్రామ సభ ఏర్పాటు చేయగా గ్రామ సభలో పాలకవర్గం ప్రత్యేకంగా తీర్మానించారు.
అనంతరం ఎంపీటీసీ బాచుపల్లి యాదగిరి మాట్లాడుతూ.. ఈ విషయాన్ని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి దృష్టికి తీసుకుపోయామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు ఎంఓసి గ్రామపంచాయతీ నుండి ఇవ్వమని తెలిపారు. ఈపాస్ ద్వారా ఆన్‌లైన్ అనుమతులు పొందినట్లు తెలిసిందని అయినప్పటికీ మా గ్రామ శివారులో ఈ కంపెనీ నిర్మాణ పనులు చేపడితే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. గ్రామ సభలో గ్రామస్తులు ముందు గ్రామ పంచాయతీ పాలకవర్గం ఫార్మసీ కంపెనీకి వ్యతిరేకంగా తీర్మానించినట్లు గ్రామ కార్యదర్శి ప్రభాకర్ తెలిపారు.