Mahesh Babu: మహేష్ బాబు తండ్రి పాత్రలో కన్నడ స్టార్..

by Manoj |   ( Updated:2022-07-04 09:02:23.0  )
Upendra to play Mahesh Babu Father Role in Trivikram Movie
X

దిశ, సినిమా : యూనిక్ మూవీస్‌తో స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకున్న కన్నడ స్టార్ ఉపేంద్ర మరోసారి తెలుగులో హల్ చల్ చేయబోతున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీలో కీలకపాత్రలో నటించబోతున్నాడు.

ఇందులో మహేష్ తండ్రి క్యారెక్టర్‌లో పవర్ ఫుల్‌గా కనిపించనున్నట్లు సమాచారం. ఇంతకు ముందు ఇదే పాత్రలో బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ నటిస్తాడని టాక్ రాగా.. ఈ రూమర్స్‌లో ఏది నిజమో తెలియాలంటే అధికారి ప్రకటన రావాల్సిందే. ఇక ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయిక కాగా.. త్రివిక్రమ్ సినిమాలో తండ్రి పాత్రకు మంచి స్కోప్ ఉంటుందని తెలిసిన విషయమే.

Advertisement

Next Story

Most Viewed