- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Lal Darwaza Bonalu: ఢిల్లీలో ఘనంగా ముగిసిన లాల్‌దర్వాజా బోనాలు..
దిశ, చార్మినార్: Union Minister Kishan Reddy Participated in Lal Darwaza Bonalu at Telangana Bhavan, New Delhi| దేశ రాజధాని ఢిల్లీ తెలంగాణ భవన్‌లో రెండు రోజుల పాటు అత్యంత వైభంగా సాగిన లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి బోనాల ఉత్సవాలు బుధవారం ముగిశాయి. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖా మంత్రి జి.కిషన్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరపున కిషన్ రెడ్డి అమ్మవారికి బంగారుబోనం సమర్పించారు. కేంద్ర టూరిజం శాఖా డైరెక్టర్ కమలవర్థన్ పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కిషన్‌రెడ్డితో పాటు మాజీ ఎంపీ మంద జగన్నాథం తదితరులు బోనాల ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం లాల్‌దర్వాజా బోనాల ఉత్సవాల ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు.
లాల్‌దర్వాజా శ్రీ సింహవాని మహంకాళి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించే బోనాల ఉత్సవాలకు వచ్చే ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం చేస్తామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హామి ఇవ్వడం పట్ల లాల్‌దర్వాజా అలయ ఫోర్‌మెన్ కమిటీ ధర్మకర్తలు సీరా రాజ్‌కుమార్, చెన్నబోయిన శివకుమార్ యాదవ్, పోసాని సురేందర్ముదిరాజ్లు హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీలో నిర్వహించిన బోనాల ఉత్సవాలకు సహకరించిన వారందరికి ఫోర్‌మెన్ కమిటీ కృతజ్ఞతలు తెలిపింది. ఈ బోనాల ఉత్సవాలలో ఆలయ కమిటీ ప్రతినిధులు లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ కమిటీ ప్రతినిధులు కాశీనాథ్‌గౌడ్, విష్ణుగౌడ్, మాణిక్ ప్రభుగౌడ్, సి.వెంకటేష్, బల్వంత్‌యాదవ్, పోసాని సదానంద్‌ముదిరాజ్, లక్ష్మీనారాయణ, రాజ్‌కుమార్, చంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందజేస్తాం.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
లాల్‌దర్వాజా శ్రీ సింహవాని మహంకాళి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించే బోనాల ఉత్సవాలకు వచ్చే ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం చేస్తామని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖా మంత్రి జి.కిషన్‌రెడ్డి ప్రకటించారు. ఢిల్లీ బోనాల ఉత్సవాల అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత వైభవంగా బోనాల ఉత్సవాలకు నిర్వహించడానికి కేంద్ర పర్యాటక శాఖా ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం చేస్తానని హామి ఇచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తరపున బోనాల పండుగ శుభాకాంక్షలు ఆయన తెలియజేశారు. దేశంలో ఎక్కడలేని విధంగా తెలంగాణలో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటామని చెప్పారు. రాష్ట్ర రాజధాని అయినటువంటి భాగ్యనగరంలోఅత్యంత వైభవంగా అమ్మవారి బోనాల పండుగను అనేక సంవత్సరాలుగ నిర్వహిస్తున్నారన్నారు. లాల్‌దర్వాజా సింహవాహిని బోనాల ఉత్సవాలను ఎపీ భవన్, తెలంగాణ భవన్‌లోను నిర్వహించడం సాంప్రదాయంగా వస్తుందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.