మాయా దర్పణం.. సినిమా కాదు నిజమే.. మీరూ ఆర్డర్ చేయొచ్చు!

by Javid Pasha |
మాయా దర్పణం.. సినిమా కాదు నిజమే.. మీరూ ఆర్డర్ చేయొచ్చు!
X

దిశ, ఫీచర్స్ : ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన హాలీవుడ్ సినిమాల్లో 'హ్యారీపోటర్' కూడా ఒకటి. ఈ సినిమాలోని ఇన్‌విజిబిలిటీ క్లాక్ నుంచి ప్రేరణ పొందిన యూకేకు చెందిన 'ఇన్‌విజిబిలిటీ షీల్డ్ కో' స్టార్టప్ రియల్ లైఫ్ ఇన్‌విజిబిలిటీ షీల్డ్స్ రూపొందిస్తోంది. ఈ షీల్డ్స్ దాని వెనకున్న ఆబ్జెక్ట్స్ కనిపించకుండా కంటిని మాయ చేస్తుండగా, ఇందుకోసం కంపెనీ ప్రత్యేకమైన 'ఇంజనీరింగ్ లెన్స్ సిరీస్'‌ను ఉపయోగిస్తోంది. శత్రువుల నుంచి తప్పించుకునేందుకు సాయపడే ఈ షీల్డ్స్ విశేషాలు తెలుసుకుందాం.

సాధారణ అద్దంలో చూస్తే మన ప్రతిబింబం మనకు కనిపిస్తుంది, అదే నల్లని పూతతో ఉన్న మిర్రర్‌ను పరిశీలిస్తే మన రూపాన్ని చూపించదు కానీ అవతలివైపున్న వ్యక్తులను, వస్తువులను చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఇక కంటికి ధరించే అద్దాలతో పాటు, వాహనాలకు వాడేవి కూడా భిన్నమైన లక్షణాలు కలిగి ఉంటాయి. ఈ క్రమంలోనే 'ఇన్విజబుల్ షీల్డ్స్' అనేవి బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చే కాంతిని షీల్డ్ ముందు భాగంలో వ్యాపింపజేయడంతో పరిశీలకుడి దృక్కోణం నుంచి చూసినప్పుడు సాధారణంగా కనిపించే ప్రాంతం కనిపించదు దీంతో దాని వెనక మనముంటే ఎవరికీ కనిపించకుండా చేస్తుంది. ఎన్నో ప్రయోగాల తర్వాత పరిశోధకుల బృందం ఇన్విజిబుల్ షీల్డ్స్‌కు ఓ రూపం తీసుకురాగా, వీటిని 100శాతం రీసైక్లింగ్‌కు అనువుగా తయారుచేయడం విశేషం.


ఇతరుల దృష్టి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు ఇన్‌విజిబిలిటీ షీల్డ్స్ ఉపయోగపడనుండగా, ఇవి ఎలాంటి దాడి నుంచి వారిని రక్షించవని కంపెనీ పేర్కొంది. ఆకులు, గడ్డి, రెండర్ చేసిన గోడలు, ఇసుక, ఆకాశం, తారు, సముద్రం వంటి నేపథ్యాల్లో ఈ షీల్డ్స్ ఉత్తమ పనితీరును ప్రదర్శిస్తాయి. వీటిని కిక్‌స్టార్టర్ ప్లాట్‌ఫామ్ ద్వారా బుక్ చేసుకునే అవకాశముండగా 12×8 అంగుళాల పరిమాణం గల ఇన్‌విజిబిలిటీ షీల్డ్ ధర £49 ($65) ఉంది. ఈ మేరకు కొన్ని రోజుల వ్యవధిలోనే వందల కొద్దీ ముందస్తు ఆర్డర్స్ నమోదు కాగా, ఈ ఏడాది డిసెంబర్‌లోగా డెలివరీలను ప్రారంభించాలని భావిస్తోంది ఇన్‌విజిబిలిటీ షీల్డ్ కంపెనీ.

Advertisement

Next Story

Most Viewed