శుభకార్యానికి వెళ్లి వస్తూ కానరాని లోకానికి వెళ్లిన ఇద్దరు

by S Gopi |
శుభకార్యానికి వెళ్లి వస్తూ కానరాని లోకానికి వెళ్లిన ఇద్దరు
X

దిశ, మల్లాపూర్: బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి వెళ్లి వస్తూ ద్విచక్ర వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న మట్టి కుప్పకి తగిలి పడి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మల్లాపూర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మల్లాపూర్ శివారులో శుక్రవారం రాత్రి 9:30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామనికి చెందిన సింగారపు పోచయ్య(60), గోధూర్ శంకర్(42) పాత ధామ్ రాజ్ పల్లి గ్రామంలోని తమ బంధువుల ఇంట్లో జరిగిన ఓ శుభకార్యానికి శుక్రవారం మధ్యాహ్నం ద్విచక్రవాహనంపై వెళ్లారు. వేడుక ముగిశాక తిరుగు ప్రయాణంలో స్వగ్రామనికి సంతోషంగా బయలుదేరిన ఇద్దరూ పాత ధామ్ రాజ్ పల్లి - మల్లాపూర్ మధ్య కోళ్ల ఫారం వద్దకు చేరుకోగానే ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడ్డారు. దీంతో పోచయ్య, శంకర్ కు తీవ్ర గాయాలయ్యాయి రక్తపుమడుగులో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న మల్లాపూర్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలికి వెళ్లి విచారణ చేపట్టారు.

ఇసుక అక్రమ రవాణా చేసే ట్రాక్టర్ ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగినట్లు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. సంఘటనా స్థలానికి మెట్ పల్లి సిఐ శ్రీను చేరుకొని మృతి చెందిన పోచయ్య, శంకర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, అక్కడికి వచ్చిన ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేయగా కోళ్లఫారంలో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ రికార్డింగ్ ని ఆధారంగా చేసుకొని అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టనున్నట్లు సీఐ శీను, మల్లాపూర్ ఎస్ఐ నవీన్ కుమార్ వివరించారు. సింగారపు నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

Advertisement

Next Story