హుజురాబాద్‌లో ఘోర ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం

by GSrikanth |   ( Updated:2022-03-08 16:35:46.0  )
హుజురాబాద్‌లో ఘోర ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం
X

దిశ, హుజూరాబాద్ రూరల్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌ మండలంలోని సింగాపూర్ గ్రామ శివారులో ఘోర ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి బోల్తా పడటంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం మంగళవారం రాత్రి జరిగింది. కరీంనగర్ నుండి హన్మకొండ వైపు వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి బోల్తా పడింది. విషయం తెలిసిన పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులు హన్మకొండ జిల్లాకు చెందిన బొజ్జ శ్రీనివాస్, ధర్మ తేజ, సువర్ణ, మణి తేజ, వినోద్, సురేష్, అమృత్, సాయికుమార్‌లుగా గుర్తించారు. వీరు వేములవాడలోని రాజరాజేశ్వర దేవాలయంలో దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా సింగపూర్ క్రాస్ రోడ్ వద్ద ప్రమాదం జరిగిందని అన్నారు. అనంతరం క్షతగాత్రులను హుజురాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో డాక్టర్ల సూచన మేరకు వారిని వరంగల్ ఎంజీఎంకి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story