'వారి ప్రవర్తన నచ్చకే టీఆర్ఎస్‌కు రాజీనామా చేస్తున్నాం'

by GSrikanth |
వారి ప్రవర్తన నచ్చకే టీఆర్ఎస్‌కు రాజీనామా చేస్తున్నాం
X

దిశ, పెన్‌పహాడ్: సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం పొట్లపహాడ్ గ్రామంలో అధికార టీఆర్ఎస్‌ పార్టీకి షాక్ తగిలింది. అధికార పార్టీకి చెందిన గ్రామ ఉప సర్పంచ్ దాచేపల్లి నాగయ్య పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం తెలిపారు. ఉప సర్పంచ్‌తో పాటు గ్రామానికి చెందిన ఆరుగురు వార్డు మెంబర్లు గంగారపు సునీత, మేకపోతుల దుర్గా, నాగమల్ల రాంబాబు, కంచి విజయ్, కొండ నాగరాజు, నారాయణ పిచ్చమ్మలతో పాటు గ్రామ కో-ఆప్షన్ సభ్యులు ఏదుల అంజయ్య, షేక్ అంబానీ, కట్ల శ్రీనివాస్ రెడ్డిలు రాజీనామా చేశారని తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీలో కొందరు నాయకులు వ్యవహరిస్తున్న తీరు నచ్చకే పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. అంతేగాక, ఈ ఏడాది గ్రామానికి విడుదలైన ఎన్ఆర్ఈజీఎస్ నిధులు నుండి సీసీరోడ్లు చేపట్టాల్సి ఉండగా, తమకు ఎటువంటి సమాచారం లేకుండా ఇతర పార్టీ వ్యక్తులకు పనులు అప్పగిస్తున్నారని, గ్రామాభివృద్ధిలో తమకు భాగస్వామ్యం కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో నాయకులు వ్యవహరిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ తమ రాజీనామా పత్రాలను మండల పార్టీ అధ్యక్షులు దొంగ యుగేందర్‌కు అందజేశారు.

Advertisement

Next Story