- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇది ఆచారి అహంకారానికి నిదర్శనం: టీఆర్ఎస్ నాయకులు
దిశ, ఆమనగల్లు: రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న జాతీయ బీసీ కమిషన్ సభ్యులురాజ్యాంగబద్ద పదవిలో ఉన్న జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి.. బీసీ సామజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ని విమర్శించడం ఆచారి అహంకారానికి నిదర్శనమని జెడ్పీటీసీ అనురాధ, మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు అర్జున్ రావు అన్నారు. ప్రజల ఆశీస్సులు ఉన్నందున ఎమ్మెల్యేగా జైపాల్ యాదవ్ 3 సార్లు గెలిచారని అన్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కోసం రూ.4.5 కోట్లు, ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణం కోసం రూ.2 కోట్లు, ఆమనగల్ ప్రభుత్వ ఆసుపత్రి స్థాయి పీహెచ్ సీ నుండి సీహెచ్ సీగా అప్ గ్రేడ్ చేయించిన ఘనత స్థానిక ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ దే అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అనంత రెడ్డి, రైతు సమన్వయ అధ్యక్షులు నిట్ట నారాయణ, కౌన్సిలర్లు కమటం రాధమ్మ వెంకటయ్య, సోని జైరాం, ఎంపీటీసీలు సరిత పంతు నాయక్, పార్టీ ప్రధాన కార్యదర్శి శంకర్, మున్సిపాలిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ చుక్కా నిరంజన్ గౌడ్, సర్పంచులు లక్ష్మణ్ నాయక్, మల్లమ్మ యాదమ్మ, శ్రీను, నాయకులు రమేష్, రామకృష్ణ, వెంకటేష్, రమేష్, రవి, మల్లేష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.