యూపీకి చేరిన టీఆర్ఎస్ ఫ్లెక్సీల రగడ.. మోదీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు

by Sathputhe Rajesh |
యూపీకి చేరిన టీఆర్ఎస్ ఫ్లెక్సీల రగడ.. మోదీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఇటీవల అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య ఫ్లెక్సీల వార్ ఎంత వరకు వెళ్లిందో అందరికి తెలిసిందే. ఈ వ్యవహారం ఇప్పుడు యూపీలోనూ దుమారం రేపుతోంది. తాజాగా యూపీలోని ప్రయాగ్ రాజ్ లో మోడీకి వ్యతిరేకంగా హోర్డింగ్ లు వేలిశాయి. ఇందులో బైబై మోడీ అంటూ.. గ్యాస్ బండ మీద పడిన భారాన్ని వివరిస్తూ హోర్డింగ్ లు ఏర్పాటు చేశారు. తెలంగాణలో బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారాలు హోర్డింగ్ లు వెలిసినా కమలం పార్టీది ఏమీ చేయలేని పరిస్థితి. కానీ యూపీలో ఉన్నది బీజేపీ సర్కార్ కదా.. అందుకే అక్కడ మోడీకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన వివాదాస్పద పోస్టర్లపై పోలీసులు కొరడ ఝుళిపించారు. బీజేపీ నేతల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. మోడీకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన హోర్డింగ్ లకు కారణం అయిన ప్రింటింగ్ ప్రెస్ యజమానితో పాటు ఏర్పాటు చేసిన వ్యక్తిని, వారికి ఆర్థికంగా సాయం చేసిన మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఉదంతంలో సికింద్రాబాద్ కు చెందిన టీఆర్ఎస్ పార్టీ మద్దతుదారు ఒకరు ఉన్నట్లు వెలుగు చూటడంతో తెలంగాణ రాజకీయంలో హాట్ టాపిక్ గా మారింది. వీరిపైన ఐపీసీ సెక్షన్లు 153(B), 505(2) కింద కోలోనెల్ గంజ్ పోలీసులు ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. జులై 2,3 తేదీల్లో హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటాపోటీగా ఫ్లెక్సీలు వెలిశాయి. రాజకీయ యుద్ధాన్ని ఈ ఫ్లెక్సీల వార్ మరింత హీట్ పెంచింది. తాజాగా యూపీలో వెలిసిన హోర్డింగ్ లకు సికింద్రాబాద్ కు చెందిన టీఆర్ఎస్ మద్దతుదారుడితో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఇప్పుప్పుడు కలకలం రేపుతున్నాయి. సదరు వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం.

ఇది హెచ్చరికా?

టీఆర్ఎస్ త్వరలో బీఆర్ఎస్ గా మారబోతోందనే ప్రచారం జరుగుతోది. కేసీఆర్ ను దేశ్ కి నేతగా పేర్కొంటూ అనేక సందర్భాల్లో టీఆర్ఎస్ అభిమానులు దేశవ్యాప్తంగా అనేక దేశ రాజధాని ఢిల్లీతో పాటుగా ఇతర రాష్ట్రాల్లో ఫ్లెక్సీలు, హోర్డింగ్ లు ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా హోర్డింగ్ లు పెట్టడం పట్ల ఆ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. త్వరలో దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ఇలా ప్రచారం చేయాలని టీఆర్ఎస్ ప్రణాళికలు వేసుకుందనే టాక్ నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని భావిస్తున్న టీఆర్ఎస్ కు చెక్ పెట్టాలని కమలనాథులు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందులో భాగంగానే యూపీలో వెలిసిన హోర్డింగ్ పై కఠినంగా వ్యవహరిస్తోందని తెలుస్తోంది. సదరు హోర్డింగ్ ను తొలగించడమే కాకుండా వాటికి కారణం అయిన వారిని అదుపులోకి తీసుకుని బలమైన సెక్షన్షతో కేసులు నమోదు చేయడమే ఇందుకు నిదర్శనం అని అభిప్రాయ పడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed