- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిరుద్యోగులతో దోబుచులాడొద్దు: కోదండరాం
దిశ, కల్వకుర్తి: సీఎం కేసీఆర్ గారు నిరుద్యోగులతో దోబుచులాడొద్దని తక్షణమే నోటిఫికేషన్ జారీ చేయాలని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం అన్నారు. శుక్రవారం కల్వకుర్తి పట్టణంలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెద్దయ్య యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగ సమస్యపై ఆరేళ్లుగా నిరంతరం పోరాటం చేయడంతోనే సీఎం కేసీఆర్ నోటిఫైడ్ పక్రియ ప్రారంభించారన్నారు. విద్యార్థులు కోచింగ్ సెంటర్ల కోసం హైదరాబాద్ బాట పట్టారన్నారు. 119 నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వమే ఉచితంగా విద్యార్థులకు కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం శాలువాతో కోదండరాంను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ సదానందం గౌడ్, బీసీ సబ్ ప్లాన్ ప్రధాన కార్యదర్శి గోపాల్, లెక్చరర్స్ ఆంజనేయులు, మధు కాంత్, విష్ణుమూర్తి, కిరణ్, రవితేజ తదితరులు పాల్గొన్నారు.