- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకేనా వారి అరెస్ట్..?
దిశ, నేరేడుచర్ల /మేళ్లచెరువు : సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని మేళ్లచెరువు మండల కేంద్రానికి చెందిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు మంగళవారం తెల్లవారు జాముల అదుపులోకి తీసుకున్నారు. అన్నెపంగు రామయ్య నరసింహారావు, బేత సాయిరెడ్డి, దొండ పహాడ్ గ్రామానికి చెందిన కార్తీక్‌లను మేళ్లచెరువు ఎస్ఐ రవీందర్ తన సిబ్బందితో వెళ్ళి అరెస్టు చేశారు. వారిని ఎందుకు అరెస్టు చేస్తున్నారో తెలపకుండా బలవంతంగా జీపులో ఎక్కించుకొని తీసుకువెళ్లినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అలాగే అరెస్టు చేసిన వెంటనే తాము మేళ్లచెరువు పోలీస్ స్టేషన్‌కు వచ్చామని, కానీ వారిని ఇక్కడి తీసుకురాకుండా కోదాడ తీసుకువెళ్లారని, అక్కడ వారిని కొట్టి మేళ్లచెరువు పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారని వారి కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో స్థానికులు, కుటుంబ సభ్యులు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు.
ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే అరెస్టు..!
హుజూర్‌నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిని ఇటీవల శివరాత్రి సందర్భంగా నిర్వహించిన జాతరలో టీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అదే విషయంపై మేళ్లచెరువు గ్రామానికి చెందిన అన్నెపంగు రామయ్య ఎమ్మెల్యేపై బూతు పురాణంతోపాటు దేవుని విషయంలో ఎమ్మెల్యే సైదిరెడ్డి టీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు రాజకీయం చేస్తున్నారని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇదే విషయమై ఎవరైనా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి అరెస్టు చేసి ఉండవచ్చునని సమాచారం.