- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉపాధి కోసం వచ్చి ఊపిరి వదిలిన ముగ్గురు ఆంధ్రవాసులు
దిశ,చౌటుప్పల్: ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మృతి చెందిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల పరిధిలోని సర్వేలు గ్రామ శివారులో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన సీతారాముడు(30), గౌరీ(26), ఎల్లయ్య (32) లు ముగ్గురు శేరిగూడం గ్రామానికి చెందిన వర్ధం ఎల్లయ్య ఇటుక బట్టీల వద్ద పని చేయడానికి గత నాలుగు నెలల క్రితం వచ్చారు. శుక్రవారం మునుగోడు మండలం పలివెల గ్రామానికి ట్రాక్టర్ లో ఇటుక సరఫరా చేయడానికి బయలుదేరారు. ఇటుకలు అన్ లోడ్ చేసి తిరిగి వస్తుండగా సర్వేలు గ్రామం దాటగానే ఒక్కసారిగా వాహనం అదుపు తప్పి పక్కనే ఉన్న కాలువలో బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో ట్రాక్టర్ పై ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులలో సీతారాముడు, గౌరీ, ఎల్లయ్య అక్కడికక్కడే మృతి చెందారు. ట్రాక్టర్ డ్రైవర్ ఎల్లయ్యకు గుండెపోటు రావడంతోనే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రమాదం నుండి బయటపడ్డ మరో వ్యక్తి తెలిపారు. మృతుల్లో సీతారాముడు, గౌరీ ఇద్దరు భార్యాభర్తలు కావడంతో వాళ్ల బంధువుల రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు నారాయణపురం ఎస్సై యుగేందర్ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.