ఆడిషన్‌కు పిలిచి నాతో అసభ్యంగా ప్రవర్తించారు.. కాస్టింగ్ కౌచ్‌పై రష్మీ సంచలన వ్యాఖ్యలు

by Hamsa |
ఆడిషన్‌కు పిలిచి నాతో అసభ్యంగా ప్రవర్తించారు.. కాస్టింగ్ కౌచ్‌పై రష్మీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, సినిమా: సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్(casting couch) వల్ల ఎంతో మంది నటీమణులు ఇబ్బంది పడినట్లు పలు వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది ఇంటర్వ్యూలో పాల్గొని కమిట్మెంట్ అడిగి లైంగిక వేధింపులకు గురి చేస్తారని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇక ఈ విషయం బయటపడటంతో అంతా షాక్‌కు గురయ్యారు. తాజాగా, బుల్లితెర నటి రష్మీ దేశాయ్(Rashmi Desai) కాస్టింగ్ కౌచ్‌పై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ‘‘ఒక సినిమా కోసం నన్ను ఆడిషన్(audition) కోసం పిలిచారు. అప్పుడు నా వయసు కేవలం 16 ఏళ్లు.

అక్కడ ఒక వ్యక్తి మాత్రమే ఆడిషన్‌ అడిగారు. నేను కాస్త తడబడ్డాను. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు.. నేను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాను. ఆ సమయంలో ఎంతో అసౌకర్యంగా అనిపించింది. ఆ తర్వాత స్పృహలోకి వచ్చాక అక్కడి నుంచి తప్పించుకొని బయటకు వచ్చాను. ఇంటికి వచ్చాక మా అమ్మకు జరిగిన విషయం చెప్పాను. మరుసటి రోజు మా అమ్మ నేను చెప్పిన వ్యక్తిని కలవడానికి వచ్చింది. నాతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి చెంప పగలగొట్టింది. ఆ వ్యక్తి ఇప్పటికీ ఆ ఘటను మర్చిపోలేడు.

ఇప్పటికీ ఆ సంఘటన నాకు గుర్తుంది. చిత్ర పరిశ్రమలో దారి తప్పడం, లైంగిక వేధింపులు వాస్తవమే. ప్రతి రంగంలో మంచి వారు, చెడ్డ వారు ఉంటారు. ఇండస్ట్రీలో మంచి అనుభవాన్ని పొందేందుకు అద్భుతమైన వ్యక్తులతో కలిసి పనిచేసే అదృష్టం వచ్చింది. ఇప్పుడు నేను చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతాయని నాకు తెలుసు’’ అని చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story