Vettaiyan: ‘వేట్టయన్’ మూవీ బిజినెస్ వివరాలు ఇవే.. ఎంత కలెక్ట్ చేయాలంటే?

by Prasanna |
Vettaiyan: ‘వేట్టయన్’ మూవీ బిజినెస్ వివరాలు ఇవే.. ఎంత కలెక్ట్ చేయాలంటే?
X

దిశ, వెబ్ డెస్క్: రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన 'జైలర్’ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఆ మూవీ రజినీ బాక్సాఫీస్ స్టామినా ఏంటన్నది అందరికీ తెలియజేసింది. ‘జైలర్’ తర్వాత రజినీ హీరోగా మన ముందుకొచ్చిన చిత్రం ‘వేట్టయన్- ది హంటర్’. ‘జై భీమ్’ తో అందర్ని ఆకట్టుకున్న టి.జె.జ్ఞానవేల్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్ , రానా దగ్గుబాటి , రావు రమేష్ కూడా మూవీలో ముఖ్య పాత్రలు పోషించారు. ‘జైలర్’ హిట్ అవ్వడంతో ‘వేట్టయన్’ సినిమాకి ఫ్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగింది.

నైజాం - 04.00 CR

సీడెడ్ - 02.20 CR

ఉత్తరాంధ్ర - 01.20 CR

ఈస్ట్ - 0.80 CR

వెస్ట్ - 0.60 CR

గుంటూరు - 0.70 CR

కృష్ణా - 0.80 CR

నెల్లూరు - 0.40 CR

ఏపీ + తెలంగాణ (టోటల్) - 10.70 CR

‘వేట్టయన్’ మూవీకి రూ.10.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.11 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. దసరా సెలవులు ఉన్నాయి కాబట్టి.. ఈ మూవీ కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది.

Advertisement

Next Story