- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
45 ఏళ్ల వయసులోనూ సింగర్ సునీతపై మళ్లీ అవే పుకార్లు.. నెట్టింట వైరల్ అవుతున్న న్యూస్
దిశ, సినిమా: తెలుగు ఇండస్ట్రీలో సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్న సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె గాత్రానికి, అందానికి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఈ భామ ఒక్క తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళ, మలయాళ భాషల్లోనూ పాటలు పాడి అభిమానులను సంపాదించుకుంది. ఇక 19 ఏళ్ల వయసులోనే కెరీర్ ప్రారంభించిన సింగర్ సునీత ఇప్పటి వరకు 3 వేలకు పైగా పాటలు పాడింది. అలా ఈ అమ్మడు ఏ పాట పాడిన అది మళ్లీ మళ్లీ వినాలనిపించే గాత్రం ఆమెది. అలాంటి ఈ సింగర్ జీవితంలోను విషాద గాథలు లేకుండా పోలేదు.
19 ఏళ్ళ వయసులోనే పెళ్లి చేసుకున్న సింగర్ సునీతకు ఇద్దరు పిల్లలు.. ఆ తర్వాత కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల మొదటి భర్తతో విడిపోయారు. ఇక 42 వయసులో రామ్ వీరపనేని అనే ఓ ప్రముఖ వ్యాపారవేత్త రెండో పెళ్లి చేసుకున్నారు. ఇక అప్పటి నుంచి సునీత పై పలు రూమర్స్ షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈమెకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. గతంలో ఈమె తల్లి కాబోతుందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు వచ్చిన వార్తలపై సింగర్ సునీత స్పందించి అలాంటిది ఏమీ లేదని క్లారిటీ ఇచ్చింది. అయితే మరోసారి ఈ భామ తన 45 ఏళ్ళ వయసులో తల్లి కాబోతుందనే న్యూస్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.