యంగ్ డైరెక్టర్లపై కన్నేసిన సీనియర్ నటి.. వారితోనే..

by Manoj |
యంగ్ డైరెక్టర్లపై కన్నేసిన సీనియర్ నటి.. వారితోనే..
X

దిశ, సినిమా: బాలీవుడ్‌ సీనియర్ నటి భాగ్యశ్రీ బాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 'రాధే శ్యామ్‌'లో ప్రభాస్‌కు తల్లిగా కనిపించనున్న ఆమె.. ఇప్పుడొచ్చే హిందీ సినిమాలన్నీ పాత కథలేనని పెదవి విరుస్తోంది.

'ప్రస్తుతం వస్తున్న బాలీవుడ్‌ చిత్రాలన్నీ కాపీ స్క్రీప్ట్స్‌. తెలుగు, మలయాళంలో మాత్రం కొత్త కథలు చూపిస్తున్నారు. ఈ తరం పాన్ ఇండియా రేంజ్‌లో తీసే కథలనే ఇష్టపడుతున్నారు. ప్రేక్షకులు కూడా మంచి సినిమాలు చేస్తే భాషతో సంబంధం లేకుండా ఆదరిస్తున్నారు. ఆ విషయాన్ని సీనియర్ డైరెక్టర్స్, స్టోరీ రైటర్స్ గుర్తించట్లేదు. నిజానికి ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వల్ల మన సినిమా అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది' అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు యంగ్ డైరెక్టర్ల క్రియేటివిటీ బాగుంటుందన్న ఆమె.. అలాంటి వారితో పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంటోంది.

Advertisement

Next Story