గత ఐపీఎల్ సీజన్స్‌లో అత్యధిక ధర పలికిన క్రికెటర్లు వీరే!

by Web Desk |
గత ఐపీఎల్ సీజన్స్‌లో అత్యధిక ధర పలికిన క్రికెటర్లు వీరే!
X

బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 టోర్నమెంట్ సీజన్ 15 కు సంబంధించిన ఆటగాళ్ల వేలం ఈ నెల 12, 13వ తేదీల్లో జరగనుంది. బెంగళూరు వేదికగా జరగనున్న వేలానికి సంబంధించి బీసీసీఐ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఏడాది రెండు కొత్త జట్లు ఐపీఎల్‌లో సందడి చేయనుండగా.. ఈసారి ఫ్రాంచైజీలు యువ ఆటగాళ్లపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే, 2022 లో ఏ ప్లేయర్ రికార్డు ధర పలుకుతాడో అని ఐపీఎల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రిటెన్షన్ విధానంలో పాత జట్లు ఇప్పటికే కీలక ఆటగాళ్లను వదులుకున్నాయి. దేశీయ ఆటగాళ్లతో పాటు విదేశీ ఆటగాళ్లలో ఎవరు అత్యధిక ధర పలుకుతారో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉండగా ఇప్పటివరకు జరిగిన అన్ని ఐపీఎల్ సీజన్లో అత్యధిక రికార్డు ధరకు అమ్ముడు పోయిన ఆటగాళ్లు ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ఏడాది ప్లేయర్ ధర రూ.కోట్లలో

2008 ధోని (సీఎస్కే) 9.5

2009 కెవిన్ పీటర్సన్ (ఆర్సీబీ), 9.8

ఫ్లింటాఫ్ (సీఎస్కే)

2010 షేన్ బాండ్(కేకేఆర్), పొలార్డ్(ముంబై) 4.8

2011 గౌతమ్ గంభీర్ (కేకేఆర్) 14.9

2012 రవీంద్ర జడేజా(సీఎస్కే) 12.8

2013 గ్లెన్ మ్యాక్స్‌వెల్ 6.3

2014 యువరాజ్ సింగ్ (ఆర్సీబీ) 14

2015 యువరాజ్ సింగ్ (ఆర్సీబీ) 16

2016 షేర్ వాట్సన్ (ఆర్సీబీ) 9.5

2017 బెన్ స్టోక్స్ (ఆర్పీఎస్) 14.5

2018 బెన్ స్టోక్స్ (ఆర్ ఆర్) 12.5

2019 ఉనద్కత్ (ఆర్ ఆర్), వరుణ్ చక్రవర్తి (పంజాబ్) 8.4

2020 పాట్ కమిన్స్ (కేకేఆర్) 15.5

2021 క్రిస్ మోరిస్ (ఆర్ ఆర్) 16.25

Advertisement

Next Story