CM Revanth Reddy : నేడు మెదక్ జిల్లాలో ఉపరాష్ట్రపతి ధన్కడ్.. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలు

by Y. Venkata Narasimha Reddy |
CM Revanth Reddy : నేడు మెదక్ జిల్లాలో ఉపరాష్ట్రపతి ధన్కడ్.. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కడ్(Jagdeep Dhankad), గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Jishnu Dev Verma), సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)లు నేడు మెదక్ జిల్లా(Visit Medak District) లో వేర్వేరుగా పర్యటించనున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మలు తునికి కృషివిజ్ఞాన కేంద్రంలో సేంద్రియ పంటలు పండిస్తున్న 500 మంది రైతులతో ముఖాముఖిలో పాల్గొంటారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో రూ.750 కోట్లతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.

మెదక్ క్యాథెడ్రిల్ చర్చిలో వందేళ్ల వేడుకల్లో పాల్గొని క్రిస్మస్ సందర్భంగా మెదక్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. మెదక్ చర్చి అభివృద్ధి పనుల కోసం రూ. 30 కోట్లతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేస్తారు. ఏడు పాయల ఆలయం అమ్మవారిని దర్శించుకుని, ఆలయ అభివృద్ధికి రూ.35 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు.యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కి సీఎం శంకుస్థాపన చేస్తారు. మహిళా స్వయం సహాయక గ్రూపులకు రూ. 100 కోట్ల రూపాయల చెక్కును అందించనున్నారు. జిల్లాలో ఉప రాష్ట్రపతి, గవర్నర్, సీఎంల పర్యటన నేపథ్యంలో రెండు వేల మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement

Next Story

Most Viewed