దిశ ఎఫెక్ట్.. అధికారులపై సీరియస్ అయిన కలెక్టర్

by Vinod kumar |
దిశ ఎఫెక్ట్.. అధికారులపై సీరియస్ అయిన కలెక్టర్
X

దిశ ప్రతినిధి, సంగారెడ్డి: 'కంపుకొడుతున్న సంగారెడ్డి' శీర్షికన 'దిశ' లో ప్రచురితమైన వార్త కథనంపై జిల్లా కలెక్టర్​హనుమంతరావు తీవ్రంగా స్పందించారు. మున్సిపాలిటీలో మురికి కాలువలు నిండిపోయి, చెత్త కుప్పలు పేరుకుపోయే వరకు ఏం చేస్తున్నారని మున్సిపల్ సిబ్బందిపై నిప్పులు చెరిగారు. బుధవారం ఉదయం 'దిశ' లో కథనం చూసిన వెంటనే కమిషనర్​చంద్రశేఖర్​కు ఫోన్​చేసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతలా చెత్త కుప్పలు పేరుకుపోయిన, మురికి కాలువలో నీరు వెళ్లకుండా అయ్యే వరకు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఏం చేస్తారో తెలియదు అంతా క్లీన్​ కావాలని ఆదేశించారు.


మున్సిపల్ ​సిబ్బందితో పాటు అవసరమైతే పంచాయతీ సిబ్బందిని కూడా వినియోగించాలని సూచించారు. గ్రేడ్​1 మున్సిపాలిటీ దుస్థితి ఇలా ఉంటుందా..? అన్ని మండి పడ్డారు. చెత్త కుప్పలను తొలగించి, మురికి కాలువలన్నీ శుభ్రం చేయాలని సూచించారు. త్వరలోనే మున్సిపాలిటీని స్వయంగా పరిశీలిస్తానని కలెక్టర్​ హెచ్చరించారు. కలెక్టర్​ ఆదేశాలతో చంద్రశేఖర్​ మున్సిపల్ ​సిబ్బందిని రంగంలోకి దింపారు. తక్షణమే జేసీబీ యంత్రాలతో చెత్తతో నిండిపోయిన మురికి కాలువలు శుభ్రం చేయిస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా అన్ని చెత్త కుప్పలు తొలగించి, కాలువలు పూర్తి స్థాయిలో శుభ్రం చేస్తామని కమిషనర్​ చంద్రశేఖర్​ దిశ ప్రతినిధితో వెల్లడించారు. ఇదిలా ఉండగా తమ కాలనీల్లో సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేసిన 'దిశ' యాజమాన్యానికి మున్సిపాలిటీ ప్రజలు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed