- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎడాపెడా రుణాలు తీసుకుంటున్న ఏపీ సర్కార్!
దిశ, వెబ్‌డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందినకాడికి రుణాలు తీసుకుంటున్నట్లు కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. అనుమతి ఇచ్చిన అప్పుల్లో మూడు నెలల్లోనే సగానికిపైగా రుణాలను తీసుకున్నట్లు రాజ్యసభలో కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. అప్పుల విషయంలో ఏపీ సర్కార్ అందినకాడికి, అప్పు పుట్టిన ప్రతి చోటా ఎడాపెడా రుణాలు తీసుకుంటున్నట్లు వివరించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఏపీకి నికర రుణ పరిమితి కింద రూ.44,574 కోట్లు రుణం తీసుకునేందుకు కేంద్రం అనుమతి ఇవ్వగా అందులో మొదటి 9 నెలలకు రూ.40,803 కోట్లు రుణం తీసుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది.
అయితే ఏప్రిల్ నాటికి (మొదటి మూడు నెలల్లోనే) సుమారు 50 శాతానికి పైగా రుణాలు తీసుకున్నట్లు తాజాగా రాజ్యసభలో కేంద్రం వెల్లడించింది. ఏప్రిల్ వరకు బహిరంగ మార్కెట్ నుంచి రూ.21890 కోట్లు రుణాన్ని ఏపీ తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ బయటపెట్టింది. ఇది కాక కేంద్రం నుంచి మరో రూ.1373.47 కోట్లు రుణం ఏపీ ప్రభుత్వం తీసుకుందని, నాబార్డ్ నుంచి రూ.40.17 కోట్లు అప్పు చేసిందని పేర్కొంది.