- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Swag movie OTT: సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ‘స్వాగ్’.. ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు(Sri Vishnu) నటించిన లేటెస్ట్ మూవీ ‘స్వాగ్’(swag). అయితే ఇందులో ‘పెళ్లి చూపులు’ ఫేం రీతూ వర్మ(Ritu Verma) హీరోయిన్‌గా నటించింది. అలాగే దక్షా నగార్కర్, మీరా జాస్మిన్(Meera Jasmine), సునీల్ కీలక పాత్రలో కనిపించారు. హసిత్ గోలి (Hasit Goli)దర్శకత్వం వహించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్(TG Vishwaprasad) నిర్మించారు. దీనికి వివేక్ కూచిభొట్ల సహా నిర్మాతగా వ్యవహరించారు.
అయితే ఈ చిత్రం అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా, ‘స్వాగ్’(swag) సినిమా విడుదలైన మూడు వారాలకే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం ‘స్వాగ్’ సినిమా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చింది. ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండా సడెన్‌గా ఓటీటీలోకి వచ్చింది. ఇక ఈ విషయం తెలుసుకున్న శ్రీవిష్ణు ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు.