- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ థర్డ్ ఫ్రంట్‌పై దేవేంద్ర ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు!
న్యూఢిల్లీ: బీజేపీకి ధీటుగా థర్డ్ ప్రంట్ తీసుకురావాలనే తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయత్నం విఫల ప్రయోగమేనని మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. గతంలోనూ ఇలాంటివి ముందుకొచ్చిన, విఫలమయ్యాయని చెప్పారు. ఔరంగబాద్‌లో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాజాగా కేసీఆర్ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ను కలవడాన్ని ఉద్దేశించి.. రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇలా కలవడం కొత్తేమి కాదని అన్నారు. 'అంతకుముందు 2019 లోక్ సభ ఎన్నికల ముందు వీరు కలిశారు. ఏదేమైనప్పటికీ అది ఫలితం ఇవ్వలేదు.
గతంలో పలు రాష్ట్రాల్లో ఇలాంటి ప్రయత్నాలే జరిగిన ఎలాంటి ప్రయోజనం లేకపోయింది' అని తెలిపారు. త్వరలోనే తెలంగాణలో బీజేపీ ముందంజలో ఉంటుందని అన్నారు. క్రితంసారి లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ నాలుగు స్థానాల్లో నెగ్గిందని చెప్పారు. రాబోయే కాలంలో తమ పార్టీ మొదటి స్థానంలోకి వస్తుందని నొక్కి చెప్పారు. కేంద్ర మంత్రి నారాయణ్ రాణే పై ముంబై అధికారుల చర్యలను ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతీకార చర్యలకు పూనుకుందని అన్నారు. మరఠ్వాడా ను కరువు రహితంగా తీర్చిదిద్దేందుకు తెచ్చిన పథకాలను కూని చేశారని మహా వికాస్ అగాధీ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. అభివృద్ధి విషయంలో కాగితాల్లో ఒకలా చేతల్లో మరోలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.