కాంట్రాక్ట్​ అధ్యాపకులందరినీ రెగ్యులరైజ్ చేయండి.. మంత్రికి వినతి పత్రం

by Vinod kumar |
కాంట్రాక్ట్​ అధ్యాపకులందరినీ రెగ్యులరైజ్ చేయండి.. మంత్రికి వినతి పత్రం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని 11 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్​ అధ్యాపకులందరినీ రెగ్యులరైజ్ చేయాలని యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల జేఏసీ నేతలు డిమాండ్​ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ కాంట్రాక్ట్ ​అధ్యాపకుల జేఏసీ చైర్మన్​ రమేశ్​రావు మాట్లాడుతూ.. చాలా ఏండ్లుగా తాము వర్సిటీల్లో విధులు నిర్వర్తిస్తున్నామని, తెలంగాణ ఉద్యమంలో చాలా చురుకుగా పాల్గొన్నట్లు చెప్పారు. ఉద్యమ సమయంలో ముందు వరుసలో ఉన్న వర్సిటీ కాంట్రాక్ట్​ అధ్యాపకుల అందరినీ క్రమబద్ధీకరించాలని ఆయన డిమాండ్​ చేశారు.


2015లో ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్​ సెక్రటరీ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సర్క్యులర్ జారీ చేసినా, ఇప్పటి వరకు రెగ్యులరైజేషన్​ చేపట్టలేదని మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. కాగా మంత్రి ఈ అంశంపై పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన చెప్పారు. మంత్రి సబిత కు వినతి అందజేసిన వారిలో జేఏసీ కన్వీనర్​శ్రీధర్, కమల్​నాథ్, పలు వర్సిటీల నాయకులు నారాయణ గుప్త, వెంకటేశ్వర్లు, విజేందర్, శ్రీనివాస్, శరత్, సోమేశ్, ప్రేమ్, నాగేంద్ర బాబు తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story