Sonia Gandhi: ప్రియాంక గాంధీతో కలిసి ఈడీ విచారణకు హాజరైన సోనియా

by Nagaya |   ( Updated:2022-07-26 06:49:21.0  )
Sonia Gandhi Arrives at ED Office for questioning In National Herald Case
X

దిశ, వెబ్‌డెస్క్ : Sonia Gandhi Arrives at ED Office for questioning In National Herald Case| నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట రెండో రౌండ్ విచారణకు హాజరయ్యారు. ఈ నెల 21న సుమారు మూడు గంటల పాటు సోనియాను ప్రశ్నించిన ఈడీ ఈ వ్యవహారంలో కూపీ లాగే ప్రయత్నం చేసింది. సుమారు 20 ప్రశ్నలతో సోనియాను ఈడీ ప్రశ్నించినట్లు సమాచారం. తాజాగా ఈ వ్యవహారంలో నేడు మరోసారి ఈడీ సోనియాను ప్రశ్నించనుంది. సోనియాకు సహాయకారిగా ఉండేందుకు ఆమె కుమార్తె ప్రియాంక గాంధీకి ఈడీ అవకాశం కల్పించింది. ప్రియాంక గాంధీ విచారణ గదిలో కాకుండా మరో గదిలో కూర్చునేలా అధికారులు అవకాశం ఇచ్చారు.

మరోవైపు సోనియా గాంధీని ఈడీ విచారణకు పిలవడంపై దేశ వ్యాప్తంగా ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. శాంతియుత నిరసన తెలపాలని కాంగ్రెస్ శ్రేణులకు సూచించింది. మరోవైపు సోనియా గాంధీని ఈడీ విచారించడంపై ఢిల్లీలో మహిళా కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు. ఏఐసీసీ కార్యాలయం బయట నల్లబెలూన్లు పట్టుకుని ఆందోళన చేశారు. దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాలపై కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. ఇక ఢిల్లీలోని రాజ్ ఘాట్లో సత్యగ్రహ దీక్షకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు ఏఐసీసీ కార్యాలయం నుండి కాంగ్రెస్ నేతలను బయటకు రానివ్వడం లేదు. దీనిపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: కాసెపట్లో 5జీ స్పెక్ట్రమ్ వేలం ప్రారంభం

Advertisement

Next Story

Most Viewed