- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CPI Ramakrishna : సినిమా టికెట్ల ధరలు పెంచకండి : చంద్రబాబుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వంTelangana Governmentమాదిరిగా ఏపీ(AP)లో కూడా పెద్ద హీరోల సినిమాలకు బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల(Benefit Shows...Ticket Prices Hiked) పెంపు(Don't Increase)నకు అనుమతులు ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ సీఎం చంద్రబాబు నాయుడుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ(CPI State Secretary Ramakrishna)లేఖ రాశారు. ప్రత్యేక షోలు, టికెట్ల ధరల పెంపుకు అనుమతులిస్తుండటంతో నిర్మాణ సంస్థలు పెద్ద హీరోల సినిమాలను వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ప్రేక్షకుల జేబులను కొల్లగొడుతున్నాయని ఆరోపించారు. సినిమా రంగం ఒత్తిడికి తలొగ్గి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా టికెట్ల ధరల పెంపుకు, ప్రత్యేక షోలకు అనుమతించడాన్ని సీపీఐ ఖండిస్తుందన్నారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనతో తెలంగాణ ప్రభుత్వం మేల్కొందని, ఆ రాష్ట్రంలో బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపునకు అనుమతులు ఇవ్వమని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)చేసిన ప్రకటన అభినందనీయమని రామకృష్ణ తన లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ తరహాలోనే ఏపీలో కూడా సినిమా టికెట్ రేట్ల పెంపు, ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతించబోమని ఏపీ ప్రభుత్వం ప్రకటించాలని రామకృష్ణ సీఎం చంద్రబాబును కోరారు.